చంద్రబాబు పతనం ఆరంభమైంది

27 Oct, 2016 23:55 IST|Sakshi
  • దమ్ముంటే ఏలేరు ఆధునికీకరణకు రూ.100 కోట్లు విడుదల చేయండి
  • ఆర్‌బీ కొత్తూరు సభలో జక్కంపూడి రాజా 
  • ఆర్‌బీ కొత్తూరు(పెద్దాపురం) : 
    రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనం ఆరంభమైందని వైఎస్సార్‌ సీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరులో గురువారం నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్‌ సీపీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనమవుతుందని చెప్పడానికి ఈ గ్రామానికి చేరువలో ఉన్న మధురపూడి గ్రామమేనన్నారు. చిన్న గ్రామం నుంచి ఆరంభమైన పార్టీ పతనం రాష్ట్రస్థాయికి చేరుకుని దేశం పార్టీ ఖతమ్‌ కావడం తథ్యమన్నారు. ఏలేరు ఆధునికీకరణకు కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పి, మంజూరు చేసిన రూ.100 కోట్లు విడుదల చేసి చూపించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెబుతూ కనీసం చాగల్నాడు, ఏలేరు, వెంకటనగరం వంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతున్నారని రాజా అన్నారు. సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూడలేక చంద్రబాబు కుటిల ప్రయత్నాలు సాగిస్తున్నారని, అయినా ప్రజల్లో వైఎస్సార్‌ పార్టీ దూసుకుపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అనంతరం గ్రామ నాయకులు పల్లా శ్రీనివాస్‌ యాదవ్, వల్లూరి కుట్టయ్యచౌదరి, రెడ్డి జయబాబు, పాము గోవిందుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు పార్టీలో చేరారు. వారికి జక్కంపూడి రాజా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవాల లక్ష్మినారాయణ, జిగిని వీరభద్రరావు, యినకొండ వీరవిష్ణుచక్రం, ఆదారపురెడ్డి శ్రీనివాస్‌ (బ్రహ్మనాయుడు), జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి భద్రం, గవరసాని సూరిబాబు, గోపు సత్యకృష్ణ (మురళి), ఘంటా వీర్రారజు(శేషు), గంపా శివ, డేగల భాస్కరరావు, నల్లల గోవిందు, పెదిరెడ్ల రామకృష్ణ, రమేష్‌రెడ్ది, ఏలేటి రాజేంద్రప్రసాద్, మామిడి ఈశ్వరరావు, కొండేపూడి రవిబాబు (లంబూ), గుర్రాల యాకోబ్‌బాబు, నరాలశెట్టి త్రినాద్, గొందేశి భద్రరావు, పలువురు మహిళలు పాల్గొన్నారు.
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా