వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తమ్ముళ్ల దాడి

16 Aug, 2016 23:23 IST|Sakshi

యల్లనూరు :  మండల పరిధిలోని కొడవండ్లపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసి గాయపర్చిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... తాడిపత్రి ఎమ్మెల్యే∙జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం కొడవండ్లపల్లి పర్యటించారు. ఆ రోజే అనవసరంగా వైఎస్సార్‌సీపీ నేతలతో తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. మల్లారెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త తన ఇంటికి వెళ్లాలంటే టీడీపీకి చెందిన వారి ఇంటి ముందు నుంచే వెళ్లాలి.


మంగళవారం రాత్రి మల్లారెడ్డి తన ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు కేశవ, జయరామకృష్ణలు మారణాయుధాలతో దాడి చేశారు. మల్లారెడ్డి కాపాడేందుకు వెళ్లిన భూపతి, రామకృష్ణ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా వారు దాడి చేశారు.  ఈ ఘటనలో మల్లారెడ్డి తీవ్రంగా గాయపడగా, భూపతి, రామకృష్ణలు గాయాలపాలయ్యారు. బాధితులను పుట్లూరు ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు