తమ్ముళ్ల కుమ్ములాట

25 Dec, 2016 23:40 IST|Sakshi
  • కొత్తపేటలో చెరో బాట
  • ఆధిపత్య పోరు.. అభివృద్ధికి ఎసరు
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    వ్యక్తిగత ప్రాబల్యం కోసం తెలుగు తమ్ముళ్లు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. ప్రజోపకరమైన పనులను వర్గ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుంది కొత్తపేట నియోజకవర్గ టీడీపీలో ఇద్దరు నేతల తీరు. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా ఎప్పుడో చీలిపోయింది. పార్టీకి జిల్లా నాయకత్వం కూడా లేకపోవడంతో చక్కదిద్దలేని స్థాయికి ఈ వర్గ పోరు చేరింది. ఫలితంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడే దుస్థితి దాపురించింది. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్‌ఎస్‌), మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏడాదిన్నరగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య నెలకొన్న వైషమ్యాలు తాజాగా ఆదివారం ఆలమూరు మండలం జొన్నాడలో అంగ¯ŒSవాడీ భవనాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమంలో బయటపడ్డాయి. తాను చేయాల్సిన  అంగ¯ŒSవాడీ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి బండారు ముందుగానే వచ్చి ఉండటంతో ఆర్‌ఎస్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ప్రారంభోత్సవం దగ్గర సరైన ఏర్పాట్లు చేయలేదనే సాకు చూపి భవనాన్ని ప్రారంభించకుండానే ఆర్‌ఎస్‌ వెళ్లిపోయారు. అయితే అదే జొన్నాడలో రైతులు సొంతంగా నిర్మించుకున్న సొసైటీ భవనాన్ని బండారుతో ప్రారంభింపచేయాలని స్థానిక కేడర్‌ నిర్ణయించడమే ఆర్‌ఎస్‌ ఆగ్రహానికి కారణమైందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. నియోజకవర్గంలో ఇద్దరు పార్టీలో రెండు బలమైన సామాజికవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరూ పార్టీలో సీనియర్‌లే. కానీ ఎమ్మెల్యేగా బండారు అధికారాన్ని ఎక్కువ కాలం అనుభవించారు. ఆర్‌ఎస్‌కు సుదీర్ఘ నిరీక్షణ తరువాత తొలిసారి సామాజికవర్గ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభించింది. బండారు పార్టీ నియోకవర్గ ఇ¯ŒSచార్జి కావటం, ఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీగా ప్రొటోకాల్‌ ఉండటంతో నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం వీరు పోటీ పడుతున్నారు.
    దెబ్బకు దెబ్బ
    గత సెప్టెంబరులో కొత్తపేటలో జరిగిన రాష్ట్రస్థాయి షటిల్‌ పోటీల సందర్భంగా ఫ్లెక్సీల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఆర్‌ఎస్‌ నిర్వహించిన ఈ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ నాయకుడు ఫొటో లేకుండా చేశారని బండారు వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇందుకు జనచైతన్య యాత్రల్లో బండారు వర్గీయులు బదులు తీర్చుకున్నారు. కొత్తపేటలో టీడీపీ జన చైతన్యయాత్ర సందర్భంగా పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ నేత ఫొటోకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆర్‌ఎస్‌ వర్గం కినుక వహించింది. 
    జన చైతన్యయాత్రకు డుమ్మా
    ఆ తరువాత పి.గన్నవరం జనచైతన్యయాత్రలో బండారుపై మంత్రులు యనమల, రాజప్పకు ఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కొత్తపేట జనచైతన్యయాత్రల్లో తాను పాల్గొనేది లేదని తెగేసి చెప్పారు. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు వచ్చినా కనీసం పూలమాల కూడా వేయలేదు సరికదా, అనంతరం వాడపాలెంలో బండారు స్వగృహంలో విందుకు మంత్రులు వచ్చినా ఆర్‌ఎస్‌ గైర్హాజరయ్యారు. ఆయనను పలు జిల్లాలకు ఇ¯ŒSచార్‌్జగా నియమించడంతోనే రాలేకపోతున్నట్టుగా ఆర్‌ఎస్‌ వర్గం చెబుతోంది.  జెడ్పీటీసీ దర్నాల రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మ¯ŒS కోరం జయకుమార్, డీసీసీబీ డైరెక్టర్‌ చిలువూరి రామకృష్ణంరాజు, ఏఎంసీ మాజీ చైర్మ¯ŒS సయ్యపురాజు జనార్థనరాజు బండారు వర్గంగాను, ఏఎంసీ చైర్మ¯ŒS బండారు వెంకటసత్తిబాబు, కరుటూరి నరసింహరావు, మాజీ సర్పంచ్‌ సయ్యపురాజు రామకృష్ణంరాజు ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌ వర్గంగా ఉన్నారు.
    ఇ¯ŒSచార్జి నియామకంతో ఆజ్యం
    బండారు టీడీపీ నుంచి పీఆర్పీకి వెళ్లి అక్కడ ఎమ్మెల్యే అయ్య తిరిగి సొంతగూటి(టీడీపీ)కి రాగా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన ఆర్‌ఎస్‌ తన రాజకీయ శత్రువు బండారు పీఆర్పీకి వెళ్లడంతో టీడీపీకి తిరిగొచ్చారు. గడచిన ఎన్నికల వరకూ నియోజకవర్గ టీడీపీ ఇ¯ŒSచారి్జగా వ్యవహరించిన ఆర్‌ఎస్‌ను కాదని టీడీపీకి తిరిగొచ్చిన బండారుకు ఇ¯ŒSచార్జి బాధ్యతలు అప్పగించడంతోనే వీరి ఆధిపత్య పోరుకు తెరలేచింది. ఎమ్మెల్సీ అయ్యాక సమన్వయంతో వ్యవహరించకుండా ఆర్‌ఎస్‌ ఒంటెత్తు పోకడలు పోతున్నారని బండారు వర్గీయులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య వివాదం నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి వచ్చేసరికి మరింత ముదురుపాకాన పడింది.  కొత్తపేట ఏఎంసీ చైర్మ¯ŒS పదవి ఆర్‌ఎస్‌ తన వర్గీయుడైన బండారు వెంకటసత్తిబాబుకు దక్కేలా చక్రం తిప్పారు. బండారు ప్రతిపాదించిన వారిని పక్కనబెట్టేశారు. తాజాగా వాడపల్లి, ర్యాలి ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మ¯ŒSల నియామకం ఈ రెండు గ్రూపుల వివాదంతో నిలిచిపోయింది. ఈ వర్గ పోరును చక్కదిద్దలేక మంత్రులు యనమల, చినరాజప్ప చేతులెత్తేశారు. వీరి పోరు  పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిబంధకంగా తయారైంది.
     
మరిన్ని వార్తలు