పండుటాకులనూ వాడేస్తున్నారు!

5 Nov, 2016 05:00 IST|Sakshi
పండుటాకులనూ వాడేస్తున్నారు!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘పింఛను కోసం వృద్ధులు ఎక్కడికీ రావక్కర్లేదు... ఇంటికొచ్చి చేతికందించే ఏర్పాట్లు చేశాం... పెద్దకొడుకులా చూసుకుంటా!’ ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇచ్చిన హామీ! కానీ ఆచరణలో ఆయన పార్టీ నాయకులు మాత్రం రాజకీయ అవసరాలకు వృద్ధులను సైతం వాడేస్తున్నారు. చివరకు వర్షంలో కూడా జనచైతన్య యాత్రకు రప్పిస్తున్నారు. దీనికి నిదర్శనం శుక్రవారం జిల్లా ప్రధాన కేంద్రం శ్రీకాకుళంలోని ఏడో వార్డులో జరిగిన కార్యక్రమమే! ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేయడమనే ముసుగులో పార్టీ ప్రచారాన్ని తెలుగు తమ్ముళ్లు ముమ్మరం చేశారు.
 
  పింఛను వస్తుందనే ఆశతో ఉదయం ఎనిమిది గంటలకే సభావేదిక వద్దకు వందలాది మంది వృద్ధులు చేరుకున్నారు. కానీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వచ్చేవరకూ ఉండాల్సిందేనని జన్మభూమి కమిటీ సభ్యులు తేల్చిచెప్పడంతో వర్షంలోనే వణికిపోతూ ఎదురుచూడటం వారి వంతరుు్యంది. పదకొండున్నర గంటలైనా ఎమ్మెల్యే రాకపోవడంతో కొంతమంది వృద్ధులు ధైర్యం చేసి టీడీపీ నాయకులను ప్రశ్నించారు. తీరా వారి నుంచి ‘రేపు ఇస్తాం రండి’ అని సమాధానం రావడంతో వెనుదిరిగారు. అలా అడిగితే ఎక్కడ ఇంటికి పొమ్మంటారోనని భయపడి కొంతమంది వృద్ధులు వర్షంలో తడుస్తునే సభావేదిక వద్ద ఉండిపోయారు.
 

మరిన్ని వార్తలు