జిల్లాలో టీడీపీ బలహీనం

26 Aug, 2016 21:20 IST|Sakshi
జిల్లాలో టీడీపీ బలహీనం
 
  •   పదవుల కోసం పార్టీలో చేరలేదు
  • అందరితో మమేకమై పనిచేస్తాం 
  •  టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం   
నెల్లూరు సిటీ : జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉందని, అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తాము పదవులు ఆశించి టీడీపీలో చేరలేదని, పార్టీలోని అందరితో మమేకమై పని చేస్తామన్నారు. నగరంలోని సంతపేటలో ఆయన నివాసంలో శుక్రవారం ఆనం కుటంబ సభ్యులు ఆత్మీయులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరామన్నారు. టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం, ప్రజలపై పెత్తనం చేయడానికి తాను బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీతో పోరాటం సంగ్రామం ఉంటుందన్నారు. శనివారం సీఎం చంద్రబాబును కలిసి భవిష్యత్‌ కార్యాచరణపై సూచనలు తీసుకుంటామని, 28న పార్టీ  జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాందరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి  పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు