హైస్కూల్స్‌లో టీచర్ల కొరత

24 Sep, 2016 23:29 IST|Sakshi
హైస్కూల్స్‌లో టీచర్ల కొరత
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి
– ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌
యాళ్లూరు(గోస్పాడు): ఉపాధ్యాయుల కొరత కారణంగా ఉన్నత పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని డిమాండ్‌ చేశారు. యాళ్లూరు ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉపా«ధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్రమూల్యాంకన విధానానికి అనుగుణంగా క్రమబద్ధీకరణ కమిటీ సిఫార్సుల మేరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 55, 61 ఉత్తర్వులను రద్దు చేసి కొత్త స్టాప్‌ ప్యాట్రన్‌ ఉత్తర్వులను విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్‌ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయాలన్నారు. సీపీఎస్‌ ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ వర్తింపు ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని నరసింహారెడ్డి తెలిపారు. ఒప్పంద అధ్యాపకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శివశంకర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, సుబ్బయ్య, బాబురావు, హెచ్‌ఎం పుల్లారెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు