-

జేఎన్‌టీయూ విద్యార్థులకు సాంకేతిక విద్య

25 Aug, 2016 23:04 IST|Sakshi
జేఎన్‌టీయూ విద్యార్థులకు సాంకేతిక విద్య

పులివెందుల రూరల్‌ :
పట్టణంలోని ముద్డనూరు రోడ్డులో ఉన్న జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందనుంది. 2005లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో బీటెక్‌లోని ఐదు కోర్సులు ప్రారంభించారు. అనంతరం ఎంటెక్‌ కోర్సులు సైతం ప్రారంభించారు. డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. వీటితోపాటు టెక్నిక్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ ఇంప్రుమెంటు ప్రోగ్రాం కింద మరో రూ.20లక్షలు ప్రపంచ బ్యాంకు నిధులతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను అడ్మినిస్ట్రేషన్‌ భవనంపై అంతస్తులో అమర్చారు. దీనివల్ల విద్యార్థులు భారీగా డేటా నిక్షిప్తం చేసుకోవచ్చు. అంతేకాకుండా క్యాంపస్‌లో ఎక్కడైనా ఈ డేటా సెంటర్‌ ద్వారా విద్యకు సంబంధించిన అన్ని అంశాలను దీని ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది. ఇలాంటి డేటా సెంటర్‌ అనంతపురం జెఎన్‌టీయూ యూనివర్శిటీతోపాటు రాయలసీమలోని ప్రయివేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సైతం ఇలాంటి సదుపాయం లేదు. దీన్ని పులివెందుల జెఎన్‌టీయూలో ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగ కల్గనుంది.
నేడు ప్రారంభించనున్న వీసీ :
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్‌ను అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ఎంఎంఎం సర్కార్‌ శుక్రవారం లాంచనంగా ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ గోవిందరాజులు, వైస్‌ ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడంవల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు