సాంకేతికమక

4 Feb, 2017 23:43 IST|Sakshi
  • చౌక దుకాణాల్లో ముందుకు సాగని నగదు రహిత రేషన్‌ పంపిణీ
  • జిల్లాలో 3.94 లక్షల మంది రేష¯ŒS కార్డుదారులకు చేరని సరుకులు 
  • నాలుగు రోజులైనా 26 శాతానికి మించని వైనం
  • తప్పని ప్రదక్షిణలు...
  • కాకినాడ సిటీ :
    నగదు రహితంగానే చౌక దుకాణాల్లో రేష¯ŒS సరుకులు అందించాలనే ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు కార్డుదారులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్నాయి.   నగదు రహితం లావాదేవీలంటూ విస్తృత ప్రచారం చేసి చౌక దుకాణాల్లో కార్డుదారుల నుంచి డిసెంబర్‌లో సొమ్ము తీసుకోకుండా సరుకులు ఇచ్చేశారు. రేష¯ŒS సరుకుల పంపిణీ ఆధార్‌ అనుసంధానంతో జరుగుతుండడంతో దానికి బ్యాంకుల డేటా అనుసంధానం చేయాల్సి ఉంది. దీంతో జనవరిలో నగదు రహిత సేవలు చౌక దుకాణాల్లో ముందుకు సాగలేదు. అయితే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రహిత లావాదేవీలే జరపాలి, కార్డుదారుడు నుంచి సొమ్ము తీసుకుని సరుకు ఇవ్వడానికి లేదని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ బ్యాంకు డేటా సీడింగ్‌ పరంగా నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కరించకపోవడంతో నెల ప్రారంభమై నాలుగు రోజులైనా రేష¯ŒS పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఒక్కరోజు వంద మంది కార్డుదారులకు సరుకులు ఇచ్చే డీలర్‌ ఇప్పుడు రోజుకు 15 మందికి ఇవ్వడం గగనంగా మారింది. ఈ దశలో చౌక దుకాణాల వద్ద కార్డుదారులు పడిగాపులు పడుతూ, షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలు చౌక దుకాణాల్లో సర్వర్‌ ఇబ్బందులు, ఇతర సాంకేతిక సమస్యలతో షాపులు మూసివేసి డీలర్లు మెషీన్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోపక్క కార్డుదారులు పదే పదే పనులు మానుకుని ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్ధితి జిల్లాలో నెలకొంది.
    సరుకులు పంపిణీ 26శాతం...
    జిల్లా వ్యాప్తంగా ఈ–పాస్‌ బయోమెట్రిక్‌ మిషన్లున్న 2,449 షాపుల పరిధిలో మూడు రోజులుగా 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. మొత్తం జిల్లాలో 16,08,711 కార్డులకుగాను ఏజెన్సీకి సంబంధించి సుమారు లక్ష కార్డులు తీసివేయగా మిగిలిన కార్డుల్లో శనివారం రాత్రి 7 గంటల వరకు తెలిసిన సమాచారం మేరకు కేవలం 3 లక్షల 94 వేల మంది కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఇందులో రెండు విధాలుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. 2449 ఈ–పాస్‌ మిషన్లుండగా వీటిలో 480 ఎ¯ŒSలార్జిక్‌ కంపెనీ మెషీన్లున్నాయి. వీటికి బ్యాంకుల డేటా పూర్తిగా అనుసంధానం కాకపోవడంతో ఆ మిషన్లున్న చౌక దుకాణాల పరిధిలో కార్డుదారుల నుంచి సొమ్ము తీసుకుని సరుకులు ఇచ్చేస్తున్నారు. ఈ షాపుల్లోనే 3 లక్షల 16 వేల కార్డులకు రేష¯ŒS పంపిణీ చేశారు. ఇక మిగిలిన 1,969 మెషీన్లు విజ¯ŒSటెక్‌ కంపెనీవి . వీటిలో కేవలం నగదు రహితంగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ షాపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులుతో కేవలం 77,766 కార్డులకు సరుకులు ఇవ్వగలిగారు. ప్రతి నెలా నాలుగు రోజుల్లో 7 లక్షల కార్డులకుపైగా సరుకులు పంపిణీ చేసేవారు. 
    సమన్వయలోపం...
    ప్రజా పంపిణీ వ్యవస్థలో  నగదు రహిత లావాదేవీలు అమలు జరపడంలో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. గడిచిన రెండు నెలలుగా నగదు రహితంపై ప్రచారం చేస్తున్న అధికారులు అసలు సమస్య పరిష్కరించకుండా కార్డుదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో కార్డుదారుల ఆధార్‌ బ్యాంకులో సీడింగ్‌ కాలేదని, అకౌంట్‌లో బ్యాలె¯Œ్స లేదని, అకౌంట్‌ ఇ¯ŒS ఆపరేట్‌లో ఉందనే అంశాలు ఎదురవుతున్నాయి. మరోపక్క  పలు షాపుల కార్డుదారుల బ్యాంకు డేటా ఆయా షాపుల ఈ–పాస్‌ బయోమెట్రిక్‌ మెషీ¯ŒS అనుసంధానం కాకపోవడం వంటివి ఉన్నాయి. ఇవి గత రెండు నెలలుగా ఉన్నవే. వాటిని అధికారులు పరిష్కరించకుండా నగదు రహితంగానే సరుకులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించడంపై సర్వత్రా కార్డుదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
     
మరిన్ని వార్తలు