ఉ‘త్తీజ్‌’..

1 Aug, 2016 01:39 IST|Sakshi
ఉ‘త్తీజ్‌’..
నిజామాబాద్‌కల్చరల్‌ : 
బంజారాలు సంప్రదాయ పండుగైన తీజ్‌ను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. యువతులు గోధుమ మొలకలతో ఉన్న బుట్టలను తలపై ధరించి  నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్‌ మైదానంలో జరిగిన  కార్యక్రమంలో  నిజామాబాద్‌ ఎంపీ కవిత, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్, మేయర్‌ సుజాత పాల్గొన్నారు. యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు.
 
బంజారాలు సంప్రదాయ పండుగైన తీజ్‌ను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ నెల 23 న జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో బంజారా తీజ్‌ ఉత్సవం–2016 పేరిట తీజ్‌ ఉత్సవాలను ప్రారంభించారు. యువతులు బుట్టల్లో గోధుమ మొలకలను వేశారు. శనివారం వరకు రోజూ పూజలు చేశారు. ఆదివారం తీజ్‌ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువతులు గోధుమ మొలకలతో ఉన్న బుట్టలపై తలపై ధరించి, శోభాయాత్రగా కలెక్టరేట్‌ వరకు వచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్, నిజామాబాద్‌ ఎంపీ కవిత, మేయర్‌ సుజాత పాల్గొన్నారు. కలెక్టరేట్‌ మైదానంలో యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఆ తర్వాత కొందరు అశోక్‌సాగర్‌లో, మరికొందరు బాసర గోదావరి జలాలలో గోధుమ మొలకలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకుడు ఎస్‌ఏ అలీం, కార్పొరేటర్లు విశాలినీరెడ్డి, కాపర్తి సుజాత, కడారి శ్రీవాణి, చాంగుబాయి, రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు జగన్‌నాయక్,  తీజ్‌ ఉత్సవ నిర్వహణ కమిటీ ప్రతినిధులు డాక్టర్‌ మోతీలాల్, ప్రేమ్‌లాల్,  చాంగుబాయి, సంతోష్‌నాయక్, రవీంద్రనాయక్, శంకర్‌ నాయక్, తుకారాం నాయక్, గంగాధర్, శ్రీహరినాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
తీజ్‌ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ
కామారెడ్డి : బంజార సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలో తీజ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, బంజార సేవా సంఘం నేతలు గణేశ్‌ నాయక్, మోతీసింగ్, డాక్టర్‌ వెంకట్, జమునా రాథోడ్, రాణాప్రతాప్, లస్కర్‌నాయక్, బల్‌రాం, ప్రవీణ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు