'మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

28 Oct, 2015 16:50 IST|Sakshi
'మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

అల్లాదుర్గం (మెదక్ జిల్లా) : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలో దీపం పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు గ్యాస్ సిలండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కట్టెల పోయ్యిలతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే గ్యాస్ కనేక్షన్‌లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ్గానికి 5 వేల కనేక్షన్‌లు మంజూరయినట్లు తెలిపారు. విడతల వారిగా అర్హూలైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మంజూరు చేసినట్లు ఆయన ఆరోపించారు.

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ రాంగారి ఇందిర, జెడ్పీటీసీ కంచరి మమత, వైస్ ఎంపీపీ బిక్షపతి, ఎంపీడీఓ కరుణశీల, తహశీల్దార్ చంద్రకళ, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు సుభాశ్‌రావ్, టీఆర్‌ఎస్ నాయకులు ప్రతాప్‌లింగాగౌడ్, ఎంపీటీసీలు అనూరాధ, శివాజీరావ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!