తెలంగాణ సస్యశ్యామలానికే మహారాష్ట్ర ఒప్పందం

23 Aug, 2016 23:52 IST|Sakshi
మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.బి.బేగ్‌
  • కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
  • సంబరాల్లో రైతులు ఉంటే నిరసనలకు దిగటం సరికాదు
  • ఖమ్మం వైరారోడ్‌ : మహరాష్ట్ర– తెలంగాణ రాష్ట్రాల మధ్య  గోదావరి నదిపై మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి తుది ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.బీ. బేగ్‌ అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్టాన్ని కరువు కాటకాలు, రైతుల కన్నీళ్ల నుంచి కాపడటం కోసం సీఎం కేసీఆర్‌ తీవ్రంగా కృషిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని కోటి ఎకరాల మాగాణి చేసే ప్రయత్నంలో ఈ ఒప్పందం ముందడుగని పేర్కొన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పాలనలో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని,ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మహరాష్ట్రతో ఒప్పందం చేసుకోవటానికి కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం కృషి ఫలితంగా ఒక పక్క రైతులు సంబరాలు చేసుకుంటుంటే, కాంగ్రెస్‌ పార్టీ నిరసనలకు దిగటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు,టీఆర్‌ఎస్‌ నాయకులు బిచ్చాల తిరుమలరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు