త్వరలో టెలీ మెడిసిన్‌ సేవలు

13 Aug, 2016 23:35 IST|Sakshi
త్వరలో టెలీ మెడిసిన్‌ సేవలు
  • ఆధునిక వైద్య సేవలను ప్రవేశపెట్టాలని సర్కారు యోచన 
  • కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి
  • ఫిజీషియన్ల సదస్సు ప్రారంభం
  • ఎంజీఎం : ఆస్పత్రుల్లో టెలీ మెడిసిన్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎంజీఎం, కేఎంసీ మెడిసిన్‌ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఫిజీషియన్ల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వీసీ కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు.
     
    ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులో అనుభవజ్ఞులైన వైద్యులు ఇచ్చే ఉపన్యాసాలు, ప్రజెంటేషన్లు వైద్య విద్యార్థులకు, సహ వైద్యులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వైద్యులు రోగులకు చికిత్స అందించడంతో తమ బాధ్యతను సరిపెట్టుకోకుండా, ఆయా రోగాలు రాకుండా ఉండేందుకు వారి జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులపై అవగాహన కల్పించాలన్నారు. సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను వీసీతో పాటు ప్రముఖ ఫిజీషియన్లు  మురుగనాథన్, నర్సింహం, సహాయ్, రామకృష్ణారెడ్డి, మనోహర్, కరుణాకర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కందగట్ల మనోహర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఫిజీషియన్ల చాప్టర్‌ అధ్యక్షుడు వి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి జి.చంద్రశేఖర్, వైద్యులు బాలాజీ, హేమంత్, రాకేశ్‌తో పాటు సుమారు 500 మంది ఫిజీషియన్లు పాల్గొన్నారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు