‘తెలుగు మీడియం రద్దు’

18 Jan, 2017 23:09 IST|Sakshi
  • జీఓను ఉపసంహరించాలి
  • విద్యావికాస వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌
  • కాకినాడ సిటీ : 
    మున్సిపల్‌ యాజమాన్య పాఠశాలల్లో తెలుగుమీడియం రద్దు చేసి ఇంగ్లిష్‌ మీడియంను కొనసాగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని విద్యావికాస వేదిక డిమాండ్‌ చేసింది. బుధవారం ‘మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టుట– విద్యారంగంపై ప్రభావం’ అనే అంశంపై జనవిజ్ఞానవేదిక జిల్లా కార్యాలయంలో విద్యావికాస వేదిక జిల్లా కన్వీనర్‌ కె.సత్తిరాజు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా క్రియా ఫౌండేష¯ŒS నిర్వాహకులు ఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథరావు పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్‌ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆసక్తి మేరకు సమాంతరంగా తెలుగు, ఇంగ్లిష్‌ మాద్యమాలు ప్రవేశపెట్టి, తగిన సిబ్బందిని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యావికాస వేదిక జిల్లా కన్వీనర్‌ కె.సత్తిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకువచ్చే సంస్కరణలపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో సంప్రదించకుండా మున్సిపల్‌ శాఖామంత్రి ఏకపక్షంగా నిర్ణయించడం తగదన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇంగ్లిష్‌ మీడియం తరగతులకు పోస్టులు మంజూరు చేయాలని, విద్యారంగంలో కార్పొరేట్‌ విధానాలు తొలగించాలని, విద్యకు బడ్జెట్‌లో తగినన్ని ఎక్కువ నిధులు కేటాయించాలని, మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగుమీడియానికి సంబంధించి విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ గౌరవాధ్యక్షులు జి.ప్రభాకరవర్మ, బాలవేదిక కన్వీనర్‌ ఎ¯ŒS.బలరామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు