సౌదీలో జిల్లా వాసి మృతి

5 May, 2017 18:17 IST|Sakshi

దండేపల్లి(మంచిర్యాల జిల్లా): సౌదీ అరేబియా దేశంలో ఓ తెలుగు వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రానికి చెందిన ఎండీ హుస్సేన్‌(34) గురువారం రాత్రి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు అక్కడి అధికారులు కుటుంబసభ్యులకు తెలిపారు. బక్రీద్‌ తర్వాత ఎండీ హుస్సేన్‌ సౌదీకి వెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా హుస్సేన్‌ సౌదీ వెళ్లి అక్కడ 2 సంవత్సరాలు పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హుస్సేన్‌ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు