పామిడి, గార్లదిన్నెలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత

2 Mar, 2017 21:12 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో గరిష్ణ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటున్నాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పామిడి, గార్లదిన్నె మండలాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుంతకల్లు, శింగనమల, కొత్తచెరువు, ముదిగుబ్బ, పుట్టపర్తి, కంబదూరు మండలాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీల మధ్య కొనసాగాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. బత్తలపల్లి, కనేకల్లు, ఆత్మకూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, యాడికి, కదిరి, బొమ్మనహాల్, తాడిపత్రి, బెళుగుప్ప, పామిడి, ఓడీ చెరువు, కంబదూరు, కుందుర్పి మండలాల్లో గాలి వేగం 14 నుంచి 20 కిలో మీటర్ల వరకు నమోదైంది.

మరిన్ని వార్తలు