స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

15 Mar, 2017 23:58 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : ఉష్ణోగ్రతలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. పామిడిలో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 35 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 25 డిగ్రీల వరకు ఉన్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

అయితే తాడిపత్రి, పుట్లూరు, కొత్తచెరువు, ఓడీ చెరువు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, రొద్దం, శింగనమల, పెనుకొండ, గుమ్మగట్ట, ఆత్మకూరు, కనేకల్లు, బొమ్మనమాల్, పెద్దవడుగూరు, విడపనకల్, బత్తలపల్లి, రాప్తాడు, కంబదూరు, లేపాక్షి, హిందూపురం, అమడగూరు, అమరాపురం మండలాల్లో గాలివేగం ఎక్కువగా ఉంది. మంగళవారం 20 మండలాల్లో సగటున 2.3 మిల్లీమీటర్ల మేర అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద గత జూన్‌ నుంచి ఇప్పటివరకు 497.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గానూ 42.3 శాతం తక్కువగా 287.3 మిల్లీమీటర్లు నమోదైంది.

మరిన్ని వార్తలు