పామిడిలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

5 Apr, 2017 23:01 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో మండుతున్న ఎండలతో జనం ఇబ్బందిపడుతున్నారు. బుధవారం పామిడిలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తాడిమర్రి 42.5 డిగ్రీలు, యల్లనూరు 42.2 డిగ్రీలు, ఉరవకొండ 42.2 డిగ్రీలు, గుంతకల్లు, కూడేరు 42.1 డిగ్రీలు, పుట్లూరు 41.7 డిగ్రీలు, రాయదుర్గం 41.6 డిగ్రీలు, బత్తలపల్లి 41.5 డిగ్రీలు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం 41.4 డిగ్రీలు, యాడికి 41.3 డిగ్రీలు, శింగనమల 41.2 డిగ్రీలు, పెద్దవడుగూరు, ధర్మవరం 41 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 39, 40 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 75, మధ్యాహ్నం 16 నుంచి 26 శాతం మధ్య రికార్డయింది. గంటకు 5 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

మరిన్ని వార్తలు