పెరిగిన ఉష్ణోగ్రతలు

16 Jun, 2017 22:19 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోత మరింత అధికమైంది. నైరుతీ రుతుపవనాలు విస్తరించినా చెప్పుకోదగిన వర్షాలు పడడం లేదు. గాలి వేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై ఊరిస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. శుక్రవారం శింగనమలలో 37.01 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీలు గరిష్టం, కనిష్టం 25 నుంచి 27 డిగ్రీలు కొనసాగింది. ఉక్కపోత మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

శుక్రవారం చిలమత్తూరులో 27.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. హిందూపురం, లేపాక్షి, పెనుకొండ, గుడిబండ, మడకశిర, ఓడీ చెరువు, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, నల్లమాడ, రొద్దం, కంబదూరు, అగళి, రొళ్ల, అమరాపురం, కదిరి, అమడగూరు, రామగిరి, తలుపుల, పుట్లూరు, కూడేరు, గార్లదిన్నె, పామిడి, శింగనమల, పెద్దపప్పూరు, తాడిపత్రి, పెద్దవడుగూరు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ. కాగా ప్రస్తుతానికి 42.8 మి.మీ. నమోదైంది.

మరిన్ని వార్తలు