ఉద్రిక్తం

21 Jul, 2016 00:32 IST|Sakshi
ఉద్రిక్తం
  •  కలెక్టరేట్‌ వముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల యత్నం
  • భగ్నం చేసిన పోలీసులు
  • సీఎం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక
  •  ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ బుధవారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.  పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత దుర్మార్గపు చర్యంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు, కార్యాలయం గేట్లు మూసివేశారు. దీంతో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఒక్క ఉదుటన నాయకులు, విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు.  ఒకరిద్దరు విద్యార్థులు కలెక్టరేట్‌ గేటుపైకి ఎక్కారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

     

    ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తొపులాట చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు కుమార్, రమే శ్,తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.


    అంతకుముందు నిర్వహించిన ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజినేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23న విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 15న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
     

>
మరిన్ని వార్తలు