అనకాపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత

4 May, 2016 22:42 IST|Sakshi

అనకాపల్లిటౌన్(విశాఖపట్టణం): విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి పట్టణం పోలీస్టేషన్ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉదయ్ అనే బాలుడి కిడ్నాప్, హత్య ఘటనలపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీస్‌స్టేషన్ ముందు వేలాది మంది యువకులు 6.30 గంటల నుంచి 9.30 వరకూ బైఠాయించి, కేసు విషయమై తక్షణమే సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. అంతకు ముందు గవరపాలెంకు చెందిన దాడి జయవీర్ మిత్రమండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

యువకులకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ర్యాలీలో పాల్గొనడంతోపాటు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఆందోళన కొనసాగుతుండటంతో చివరకు డీజీపీ ఫోన్‌లో ఆందోళనకారులతో మాట్లాడారు. హత్యకేసు దర్యాప్తు ముమ్మరం చేస్తామని, దోషులకు శిక్షణపడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

>
మరిన్ని వార్తలు