బీజేపీ నేతల కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత

5 Oct, 2016 18:34 IST|Sakshi
బీజేపీ నేతల కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత

నల్లగొండ: రైతు సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సమస్యలపై ధర్నా నిర్వహించారు.

ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు పలువురు నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

మరిన్ని వార్తలు