ఫలితాలు ‘పది’లమేనా..

6 May, 2017 00:21 IST|Sakshi
రాయవరం: 
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పది పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఈ పరీక్షలు మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా స్థానంలో నిలవనుందోనన్న ఉత్కంఠ విద్యాశాఖాధికారుల్లో నెలకొంది. 
68,853 మంది విద్యార్థులు..
జిల్లాలో ఈ ఏడాది 304 పరీక్షా కేంద్రాల్లో 68,853 మంది విద్యార్థులు ‘పది’ పరీక్షలు రాశారు. వీరిలో 34,172 మంది   
బాలురు, 33,568 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 48 వేల మంది వరకు పరీక్షలకు హాజరుకాగా ప్రైవేటు పాఠశాలల నుంచి 20,853 మంది హాజరయ్యారు. 
గత మూడేళ్లుగా..
పది పరీక్షల ఫలితాల్లో గత మూడేళ్లుగా మొదటి మూడు స్థానాల్లో జిల్లా నిలిచింది. 2015–16లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవగా, 2014–15లో రెండో స్థానం, 2013–14లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత మూడేళ్లుగా ఫలితాలను చూస్తే జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలవడంతో ఈసారి కూడా అదే ప్రతిష్ఠను కొనసాగిస్తుందన్న ఆశతో విద్యాశాఖాధికారులు ఉన్నారు. గతేడాది ఫలితాల సమయంలో జిల్లా విద్యాశాఖాధికారిగా ఆర్‌.నరసింహారావు ఉండగా, ఈ ఏడాది జనవరిలో నరసింహారావు బదిలీపై వెళ్లారు. జనవరి నుంచి ఎస్‌.అబ్రహాం ఇ¯ŒSచార్జి డీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది పది పరీక్షలకు ముందుగా ఒకటే ప్రీఫైనల్‌ నిర్వహించారు. అంతకు ముందు ఏడాది రెండు ప్రీ ఫైనల్స్‌ నిర్వహించారు. గతేడాది ఆగస్టు నుంచే పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జనవరి నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇవన్నీ ఫలితాలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని పలువురు హెచ్‌ఎంలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
తొలిసారి సీసీఈ విధానంలో..
తొలిసారి ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు నిర్వహించారు. కేవలం 80 మార్కులకు మాత్రమే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించగా, ఇంటర్నల్స్‌ 20 మార్కులు కేటాయించారు. తొలిసారిగా సీసీఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న ఆందోళన విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. 
 
జిల్లాలో పరీక్షా కేంద్రాలు : 304
జిల్లా వ్యాప్తంగా పరీక్ష 
రాసిన విద్యార్థులు : 68,853
బాలురు : 34,172
బాలికలు : 33,568
ప్రభుత్వ పాఠశాలల నుంచి 
పరీక్ష రాసిన విద్యార్థులు : 48,000
ప్రైవేటు పాఠశాలల నుంచి 
పరీక్ష రాసిన విద్యార్థులు : 20,853
 
మొదటి మూడు స్థానాల్లో ఉంటాం..
ఇ¯ŒSచార్జి డీఈవోగా ఈ ఏడాది పది పరీక్షలకు సారధ్యం వహించాను. జనవరిలో బా«థ్యత తీసుకున్న అనంతరం జిల్లాలో పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఈ ఏడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో ఉంటామన్న ఆశాభావంతో ఉన్నాం. 
– ఎస్‌.అబ్రహాం, డీఈవో, కాకినాడ.
 
మరిన్ని వార్తలు