విడిపోతే ఏమవుతామోనని భయపడ్డాం: టీజీ

11 Jul, 2016 03:30 IST|Sakshi
విడిపోతే ఏమవుతామోనని భయపడ్డాం: టీజీ

కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోతే తాము ఏమవుతామోననే భయం ఉండేదని, ఇప్పుడా భయం లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్)రాష్ట్ర తృతీయ మహాసభల్లో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలు సిని మా సన్నివేశాలలాంటివన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏదైనా నష్టం జరుగుతుందని తాను సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించానని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటయ్యూక తెలుగువాళ్లమంతా ఒక్కటేననే భావన ఏర్పడడం హర్షణీయమన్నారు.  రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం గా ముందుకు సాగుతోందని అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లోనూ రాణించాలని కోరారు. సమావేశంలో ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళిగుప్తా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు