నిర్మల్‌ జిల్లాలో కలపాలని రాస్తారోకో

23 Aug, 2016 00:12 IST|Sakshi
  • స్తంభించిన రాకపోకలు
  • బంద్‌ విజయవంతం
  • నేరడిగొండ : నేరడిగొండ మండలాన్ని తిరిగి ఆదిలాబాద్‌ జిల్లాలో చేర్చడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఇచ్చిన బంద్‌లో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్‌ జిల్లాకు నేరడిగొండ మండలం వైద్య, విద్య, వాణిజ్య, చారిత్రాత్మక సంబందాలు ఉన్న నేరడిగొండ మండలాన్ని నిర్మల్‌ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేశారు. దూరభారం తగ్గడంతో పాటూ అభివద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. మేజార్టీ ప్రజల అభిష్టానాన్ని పరిగణలోకి తీసుకుని నిర్మల్‌ జిల్లాలో కలపాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు.
    అఖిల పక్ష నాయకులు సరసాని రవీంధర్‌రెడ్డి, ఆడే వసంత్‌రావ్, కొండ గోవర్ధన్, మద్దెల అడెల్లు, ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, పొన్న గంగారెడ్డి, ఆడేపు నరెంధర్, సాబ్లే ప్రతాప్‌సింగ్, కొట్టాల మోహన్, కుంట కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏలేటి దేవేందర్‌రెడ్డి ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
    స్తంభించిన రాకపోకలు
    మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిల పక్ష నాయకులు రాస్తారోకో చేయడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనాలు సుమారు 3కిలోమీటర్ల మేర స్థంబించాయి. ఆదిలాబాద్‌ వద్దు– నిర్మల్‌ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నేరడిగొండ ఏఎసై ్స దశరథ్, ఇచ్చోడ ఎసై ్స శంకర్‌ నాయక్‌లు రాస్తారోకో చేస్తున్న అఖిల పక్ష నాయకులతో మాట్లాడి కలెక్టర్‌ వద్దకు తీసుకువెళ్తానని హామీనివ్వడంతో నాయకులు రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్‌ కూనల గంగాధర్, ఎసై ్స శంకర్‌నాయక్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కాగా మండలంలో విద్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. 
     వాంకిడిలో రాస్తారోకో
    నేరడిగొండ మండలాన్ని నిర్మల్‌ జిల్లాలో కలపాలంటూ సోమవారం వాంకిడి వద్ద రాస్తారోకో చేపట్టారు. కాగా గ్రామంలోని వివిధ వ్యాపార సంస్థలతో పాటూ పాఠశాలలను స్వచ్చందంగా బంద్‌ పాటించి మద్దతు తెలిపారు. ఆందోళనలో నాయకులు రాథోడ్‌ రవీంధర్, పచ్చుసింగ్, శేక్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
     కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
    నేరడిగొండ మండలాన్ని నూతనంగా ఏర్పాటవుతున్న నిర్మల్‌ జిల్లాలోనే కలపాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌ జగన్మోహన్‌కు అఖిల పక్షం నాయకులు ఆడే వసంత్‌రావ్, సరసాని రవీంధర్‌రెడ్డి, మద్దెల అడెల్లు, కొండ గోవర్ధన్, రాజశేఖర్‌రెడ్డి, ఆడేపు నరెంధర్, ప్రపుల్‌రెడ్డి,  తదితరులు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 
     
     
మరిన్ని వార్తలు