పక్కాగా సామర్థ్యం గుర్తింపు పరీక్షలు

8 Dec, 2016 22:45 IST|Sakshi
పక్కాగా సామర్థ్యం గుర్తింపు పరీక్షలు
  •  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రాథమిక స్థాయి విద్యార్థుల ప్రతిభా, అభ్యాస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ నెల 14, 15 తేదీల్లో 2–5 తరగతుల విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు పక్కాగా ఉండాలని  డీఈఓ శామ్యూల్‌ స్పష్టం చేశారు. స్థానిక సైన్స్‌  సెంటర్‌లో గురువారం ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ   4, 5 తరగతుల విద్యార్థులకు స్టేట్‌ లెవల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (స్లాస్‌) పరీక్ష .  2 నుంచి 5 తరగతుల పిల్లలకు 3ఆర్‌ (రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్‌) పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జనవరిలో వెల్లడవుతాయన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 80 పాఠశాలల్లో నమూనా అధ్యయనం పరీక్షలు ఉంటాయన్నారు.  డీఎడ్‌ విద్యార్థులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.  తక్కిన పాఠశాలల్లో ఆయా యాజమాన్యాల పర్యవేక్షణలో ఇతర సబ్జెక్టుల టీచర్లు నిర్వహించాలన్నారు. నిర్వహణలో సందేహాలు, సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు.  డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జనార్ధన్‌రెడ్డి,  పెనుకొండ డెప్యూటీ డీఈఓ సుబ్బారావు, ఏడీ పగడాల లక్ష్మీనారాయణ, డీసీఈబీ కార్యదర్శి నాగభూషణం, ఎస్‌ఎస్‌ఏ  ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

     

     

మరిన్ని వార్తలు