రిజిస్ట్రేషన్ ఆఫీసుపై ఏసీబీ దాడి

17 Aug, 2016 20:24 IST|Sakshi

- రూ.56 వేల నగదు స్వాధీనం
నిజామాబాద్ నాగారం

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్ పనులు చేయిస్తున్నారని ఏసీబీ తనిఖీల్లో తేలింది.

 కార్యాలయంలో ఉన్న 8 మంది దస్తవేజు లేఖరులు, 18 మంది దళారులను తనిఖీ చేసి, రూ.56వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పనులన్నీ ఆన్‌లైన్ విధానం, చలానా రూపంలోనే నిర్వహిస్తుండగా, నగదు ఎందుకు ఉందంటూ అధికారులు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే డాక్యమెంట్ రైటర్ల కార్యాలయాలున్నాయి. వీరు రోజు ఆఫీస్‌లోకి వెళ్లి ముడుపులు ఇచ్చి రిజిస్ట్రేషన్ పనులు చేయిస్తున్నారని తేలడంతో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 3 నుంచి గేట్లు మూసేసి, సాయంత్రం 6 గంటల వరకు సోదాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు