కావాల్సిన చోట ఇస్తామని చెప్పి..

19 Sep, 2016 13:27 IST|Sakshi
గుంటూరు: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకునేటప్పుడు వారికి కావాల్సిన చోట ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చడంతో.. రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్ల విషయంలో తుళ్లురు మండలం శాకమూరులో సీఆర్డీఏ అధికారుల సదస్సు సోమవారం గదరగోళంగా మారింది. సదస్సులో సీఆర్డీఏ అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
మీకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తాం అని చెబుతూ భూములను లాక్కున్న అధికారులు ఇప్పుడు మాటమార్చడంతో సదస్సులో పాల్గొన్న రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మాకు నచ్చిన చోట ప్లాట్లు ఇస్తేనే తీసుకుంటాం' అని అధికారులతో రైతులు తెగేసి చెప్పారు. ఇచ్చిన చోట తీసుకోవాలంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
 
మరిన్ని వార్తలు