వడదెబ్బకు బాలుడి మృతి

6 May, 2016 11:57 IST|Sakshi

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంలో తొమ్మిదేళ్ల బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. భూక్యా అరవింద్‌కుమార్ వడదెబ్బ కారణంగా రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు అశ్వారావుపేటలో వైద్యుడికి చూపించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని చికిత్స కోసం శుక్రవారం ఉదయం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నూజివీడు వద్ద ప్రాణాలు విడిచాడు.

 

మరిన్ని వార్తలు