కోర్టు కాంప్లెక్స్‌ కోసం కోటి తిప్పలు

7 Sep, 2017 04:37 IST|Sakshi
కోర్టు కాంప్లెక్స్‌ కోసం కోటి తిప్పలు

రెవెన్యూ, న్యాయశాఖల మధ్య తెగని పంచాయితీ
►స్థలం కేటాయింపు విషయమై జిల్లా జడ్జి చర్చలు
►స్థలం విషయంలో కొలిక్కి రాని వైనం


రాజంపేట : రాజంపేటలో కోర్టు క్లాంపెక్స్‌ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక విషయంలో రెవెన్యూ, న్యాయశాఖలు తమ తమ స్థాయిలో సిగపట్లు పడుతున్నాయి. భిన్న వాదనలతో రెవెన్యూశాఖ, న్యాయవాదుల మధ్య సయోధ్య కుదరలేదని స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పంద వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడంతో రాజంపేట బార్‌ అసోసి యేషన్‌ హైకోర్టును ఆశ్రయిం చిన విష యం విదితమే. ఈ నేపథ్యంలో కోర్టు క్లాంపెక్స్‌ భవనాల నిర్మాణానికి సంబంధించి కదలిక మొదలైందనే భావనకు న్యాయవాదులు వచ్చినప్పటికి మళ్లీ స్థలం ఎంపిక సమస్యతో పీఠముడిపడింది.

కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందం ఇలా..
చాలీచాలని రీతిలో రాజంపేట కోర్టు భవనాలు ఉన్నాయనే ఉద్దేశంతో రాజం పేట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్టు క్లాంపెక్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఇందు లో భాగంగా నూతనంగా భవనాలు నిర్మించుకోవాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాజంపేట కోర్టులో జూ నియర్, సీనియర్, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టుకు ఉన్న భవనాలు అన్ని విధాలుగా అసౌకర్యంగా ఉండటంతో న్యాయవాదులు నూతనంగా కో ర్టు కాంప్లెక్స్‌ కోసం కోర్టు ఆవరణంలో ఉన్న తహసీల్దారు కార్యాలయం కలుపుకొని, సబ్‌ కలెక్టరేట్‌లో ఉన్న న్యాయమూర్తుల నివాస గృహాలను తీసుకొనే విధంగా ముందు ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో రెవెన్యూ, న్యాయ శాఖల మధ్య ఒప్పందం అమలుకాకపోవడానికి అనేక కారణాలు లేకపోలేదు.

పరిశీలనలో కొన్ని స్థలాలు
► సబ్‌ కలెక్టరేట్‌ క్యాంపస్‌లో ఉత్తర భాగంలో మూడు ఎకరాల స్థలం ఖాళీ గా ఉంది. ఈ స్థలాన్ని పరిశీలించారు.
►మళ్లీ జిల్లా జడ్జికి రెవెన్యూశాఖ అధికారులు కడప–రేణిగుంట జాతీయరహదారిలోని పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చూపించారు.
► అలాగే డిగ్రీ కళాశాల (వత్తలూరు) సమీపంలో త్రిభుజాకారంలో ఉన్న స్థలాన్ని చూపించారు. మళ్లీ ప్రస్తుతం కోర్టు క్యాంపస్‌లో ఉన్న స్థలం (గతంలో చేసుకున్న కోర్టు కాంప్లెక్స్‌ ఒప్పందం) మేరకు కావాలనే డిమాండ్‌ను న్యాయవాదులు తెరపైకి తీసుకొచ్చారు.

జిల్లా జడ్జి సుదీర్ఘ చర్చలు..
రెండురోజుల క్రితం స్థానిక జడ్జిలు, న్యాయవాదులు, ఆర్డీవో వీరబ్రహ్మంతో జిల్లా జడ్జి సమావేశమయ్యారు.  స్థలం కేటాయింపు విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.  ఈ స్థలం కోర్టు క్లాంపెక్స్‌కు ఖరారు అయితే రూ.15కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించేందుకు న్యాయశాఖ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదని పలువురు న్యాయవాదులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు