కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

5 Jul, 2017 08:05 IST|Sakshi
కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

సంగారెడ్డి జోన్‌/రూరల్‌: సదాశివపేట పట్టణ పరిధిలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి పొజిషన్‌ చూపించాలంటూ చేపట్టిన ‘కలెక్టరేట్‌ ముట్టడి’ ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాలు గు రోజులుగా సదాశివపేట కేంద్రంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన జగ్గారెడ్డి మంగళవారం కలెక్టరేట్‌ ముట్ట డికి పిలుపునిచ్చారు. పట్టణంలోని రామ మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుచరులతో సిద్ధమయ్యారు. రామ మందిరం వద్దే  జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు.

తీవ్ర ఉద్రిక్తం..
జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అతని అనుచరులు వాహనానికి అడ్డుపడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి, జహీరాబాద్‌ డీఎస్పీలు తిరుపతన్న, నల్లమల్ల రవి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

స్థలాలు ఇచ్చే వరకు పోరాటం..
నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని   జగ్గారెడ్డి వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసి ఇంద్రకరణ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20 వరకు పేదలకు పట్టాలు అందజేసిన 5,500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలకు త్చమ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్లస్థలాలు ఇప్పించే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ తోపాజి అనంతకిషన్, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పండరీనాథ్‌గౌడ్, నాయకులు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు బుచ్చిరాములు, దశరథ్, మల్కయ్య పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్స్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!