కాకి లెక్కలు తేలేదెన్నడు...

5 Dec, 2016 22:43 IST|Sakshi
కాకి లెక్కలు తేలేదెన్నడు...

గతేడాది ధాన్యం కొనుగోళ్లలో చురుకై న ప్రాతపోషించిన మహిళలు
డ్వాక్రా మహిళలకు నేటికీ అందని కమీషన్

 విజయనగరం కంటోన్మెంట్ : డ్వాక్రా మహిళలకు మంచి అవకాశమిది.. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయం పొందొచ్చని ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం అందుకు తగ్గ కమీషన్లను ఇవ్వడంలో కాకిలెక్కలు వేస్తోంది. సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించినందుకు ఇవ్వాల్సిన కమీషన్‌పై తాత్సారం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లు చేసి  సంవత్సరం గడచిపోరుునా ఇంకా కమీషన్లు ఎందుకివ్వరని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 18,81,082 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.

ఇందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన మహిళలకు రూ.5,87,83,000 కమీషన్ రావాల్సి ఉంది. అరుుతే ఒక సారి రూ.2.94 కోట్లు, మరో సారి రూ.2.21 కోట్ల కమీషన్ వచ్చింది. మొత్తంగా రూ.5.15 కోట్ల కమీషన్ రావడంతో డ్వాక్రా మహిళలు మాకిచ్చేందుకు డబ్బులు వచ్చేశాయోచ్ అని అనుకున్నారు. కానీ వీరికి మాత్రం ఇంకా కమీషన్‌లు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గోనెలు తిరిగి ఎందుకు ఇవ్వలేదని జిల్లా అధికారులు అడిగే సరికి డ్వాక్రా మహిళలకు ఏం చెప్పాలో తోచలేదు. కమీషన్ డబ్బుల్లో గోనెలకు సంబంధించిన సొమ్మును కట్ చేశారు. అదీ వేలల్లో కాదు. రూ. లక్షల్లో. జిల్లా వ్యాప్తగా పీపీసీల వద్ద ఉండిపోయాయని చెప్పి రూ.72,83,000ల కమీషన్ డబ్బులను కట్ చేశారు.  
 
అసలేమైందంటే..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన మహిళలకు అధికారులు గోనెలు అందించారు. ఈ గోనెలను పీపీసీల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇస్తే వారు హమాలీల సాయంతో ధాన్యం వేసి తూకం వేస్తారు. అలా తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించాలి. వాస్తవంగా ఇలా జరగాల్సి ఉంది. కానీ ఏం జరిగిందంటే నేరుగా మిల్లర్లు ఇచ్చిన తెల్లని గోనెల ద్వారానే కొనుగోళ్లు జరిగారుు. దీంతో కోల్‌కతా నుంచి పెద్ద ఎత్తున ధరలు వెచ్చించి కొనుగోలు చేసిన గన్నీ బ్యాగులు పీపీసీల వద్ద, వివిధ ప్రజాప్రతినిధుల వద్ద ఉండిపోయారుు. వీటిని వారు వేరే అవసరాలకు వాడుకున్నారు. కేంద్రాల వద్ద మిగిలిపోయన గోనెల్లో చాలామటుకు పాడయ్యారుు.

దాదాపు కోటి రూపాయల పైగానే వెచ్చించి కొన్న ఈ గోనెలను ఇప్పుడు అడగడంతో ఆయా గ్రామైక్య సంఘాలు వాటిని పట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చారు. కానీ లెక్కలు మాత్రం తేలలేదు. ఈ లెక్కలు ఇలా ఉంటుండగానే మళ్లీ కొత్తగా ధాన్యం కొనేందుకు కోటి రూపాయల విలువలైన కొత్త గోనెలు కొనుగోలు చేశారు. అరుుతే వీటి కొనుగోళ్లు వెనుక లొసుగులున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే పాడైన గోనె సంచుల నష్టాన్ని భరించే పరిస్థితి తలెత్తిందని పలువురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గతేడాది కమీషన్‌ను వెంటనే అందజేయాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు.  
 
కొనుగోలు కేంద్రానికి చిరిగిన గోనెలు
ఉత్తరావల్లి (మెరకముడిదాం): మండలంలోని ఉత్తరావల్లిలో వెలుగు కార్యాలయం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆదివారం మధ్యాహ్నం 20 వేల గోనెలు  వచ్చారుు. అరుుతే ఈ గోనెలను దించుతున్నప్పుడు వాటిని పరిశీలించిన డ్వాక్రా సంఘం సభ్యులు వాటిలో చిరిగిపోరుున వాటిని గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి లారీలోనుంచి దించుతుండగానే ప్రతి కట్టను విడదీసి క్షుణ్ణంగా పరిశీలించగా వచ్చిన 20 వేల గోనెలలో సుమారు 3 వేల వరకూ పూర్తిగా చిరిగిపోరుునవే ఉండడంతో డ్వాక్రా సంఘం సభ్యులు అవాక్కయ్యారు. అంతేకాదు మరో విషయమేమిటంటే ఈగోనెలను  50  ఒక కట్టగా చేసి పంపించారు. అరుుతే కట్టలో  ఉండాల్సిన 50 గోనెలకు కొన్ని కట్టల్లో 10 నుంచి 20 గోనెల వరకూ తక్కువగా  ఉన్నారుు. ఈ 20 వేల గోనెలలలో  సుమారు 10వేల నుంచి 12వేల వరకు గోనెలు మాత్రమే  ఉంటాయని డ్వాక్రా గ్రూపు సభ్యులు చెబుతున్నారు.  దీనిపై సమగ్ర ధర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘం సభ్యులతో  పాటు స్థానిక రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు