కల్వకుంట్ల కంపెనీకి చివరి ఘడియలు

24 Apr, 2017 02:19 IST|Sakshi
కల్వకుంట్ల కంపెనీకి చివరి ఘడియలు

 ⇒ వసూళ్ల కోసమే కూలీ పని
⇒ బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ


హన్మకొండ: కల్వకుంట్ల కంపెనీకి చివరి ఘడియలేనని, 2019 ఎన్ని కల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని అధికా రం నుంచి ప్రజలు సాగనంపుతారని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని పార్టీ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

పరిపాలన ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని, వారి కుటుంబానికి లబ్ధి చేకూర్చుకోవడానికి కాదని అన్నారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ నగర అభివృద్ధికి స్మార్ట్‌ సిటీ, హెరిటేజ్‌ సిటి, అమృత్‌ పథకం కింద రూ.కోట్లలో నిధులు పంపితే ఈ నిధులతో సభ నిర్వహణ పేరుతో నాణ్యతలేని, నామమాత్రపు పనులు చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

కూలీ పని చేస్తూ రూ.లక్షల్లో సంపాదించమని చెప్పుతూ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఇదే కూలీ పని చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను, ఆత్మహత్యలు జరుగకుండా రైతులను ఆదుకోవచ్చు కదా.. అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి నుంచి ఉచిత ఎరువుల పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు గురుమూర్తి శివకుమార్, జగదీశ్వర్, కుమార్, భిక్షపతిరావు, అంజనేయులు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు