ఇద్దరి మధ్య ఘర్షణ..

27 Sep, 2016 14:32 IST|Sakshi

-  లారీ కిందపడి మృతి
పోడూరు(పశ్చిమగోదావరి జిల్లా)

 పోడూరు మండలం కవిటంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చుట్టగుల్ల శ్రీను, తాడిపత్రి స్వామి(45) అనే ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో ఘర్షణ పడ్డారు. కోపంతో శ్రీను, స్వామిని తోసేయడంతో అదుపుతప్పి వెనకాలే వస్తున్న ఓ లారీ కిందపడ్డాడు. ముందు చక్రాలు అతనిపై వెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

మరిన్ని వార్తలు