యువతపైనే దేశ భవిష్యత్‌

18 Aug, 2016 00:22 IST|Sakshi
  • ట్రెయినీ ఐఏఎస్‌ అతర్‌అమీర్‌ ∙నిట్‌ విద్యార్థులతో ముఖాముఖి
  • కాజీపేట రూరల్‌ : యువత ఆలోచనలపైనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని జమ్మూకశ్మీర్‌కు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌ అతర్‌అమీర్‌ అన్నారు. కాజీపేట నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) న్యూ సెమినార్‌హాల్‌లో బుధవారం ఇంటరాక్షన్‌ విత్‌ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్, ఇండియన్‌ ఇంజినీర్‌ సర్వీస్‌ టాపర్స్‌’ పేరిట సమావేశం ఏర్పాటుచేశారు. వర ంగల్‌ నిట్‌ అలుమిని సంఘం, హన్మకొండ అదాలత్‌ నీతి ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమీర్‌ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
     
    యువత ఆలోచనలు దేశాభివృద్ధికి అవసరమని, ఇందుకు యువత సన్మార్గంలో పయనించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఐఐటీలో చదివానని చెప్పారు. సివిల్స్‌ ప్రిపరేష న్, సలహాలు, సూచనలను ట్రెయినీ ఐఎఎస్‌ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ట్రెయినీ ఐఏఎస్‌తో మాట్లాడి తమ సం దేహాలను నివృత్తి చేసుకున్నారు. సమావేశంలో ఫ్యాకల్టీ మెంబర్‌ రాజేంద్రలింగం, రాకేష్‌ దుగుడు, విద్యార్థులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు