యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

14 Sep, 2016 00:27 IST|Sakshi
యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
  • ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహించాలి
  • ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి
  • మానుకోటకు చేరిన తిరంగా యాత్ర
  • మహబూబాబాద్‌ : పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు అందేలా చూడాలని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తిని గుండెల్లో నింపేందుకు ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర మంగళవారం మహబూబాబాద్‌కు చేరింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు యాత్రకు స్వాగతం పలకగా పట్టణంలో జాతీయ జెండాలు చేబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కిరాణ వర్తక సంఘం భవనంలో పార్టీ మానుకోట నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచనదినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సి ఉండగా సీఎం కేసీఆర్‌ మైనార్టీ ఓట్ల కోసం ఎంఐఎం కలయిక కోసం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేఖించిన ఎంఐఎంను సీఎం కేసీఆర్‌ భుజాన మోస్తున్నారన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్టాల్లో అధికారికంగా విమోచన దినాన్ని  నిర్వహిస్తున్నాయన్నారు. కాగా, సెప్టెంబర్‌ 17న వరంగల్‌లో జరిగే సభకు పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతున్నారని, సభకు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
    అమరవీరుల త్యాగాలు.. 
    మజ్లిస్‌కు తాకట్టు
    గూడూరు : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను  సీఎం కేసీఆర్‌ మజ్లిస్‌ పార్టీకి తాకట్టు పెట్టారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆరోపించారు. తిరంగా యాత్ర గూడూరుకు చేరిన సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెల్పూరు శ్రీశైలం ఆధ్వర్యంలో ర్యాలీని రాంచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ బస్టాండ్‌ సెంటర్‌ చేరుకున్నాక గాంధీ, కొమురం భీం, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినాన్ని విస్మరించి ప్రజల మనోభావాలను కించపురుస్తున్నారని ఆరోపించారు.
     
    అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు సెప్టెంబర్‌ 17న హన్మకొండలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, యాప సీతయ్య, దిలీప్, కొండపల్లి పాపారావు, బోయినపల్లి లక్ష్మణ్‌రావు, క్యాచువల్‌ శ్యాంసుందర్‌ శర్మ, బి.బి.రాఘవులు, మోసంగి మురళి, శ్రీరాం పుల్లయ్య, భద్రయ్య, రాధాపటేల్, రత్నావత్‌ రమేష్, మేరెడ్డి సురేందర్, రాచకొండ కొమురయ్య, సమ్మెట సుధాకర్, కాల్సాని వేణుమాధవ్‌రెడ్డి, బత్తుల లక్ష్మణ్, పడాల నాగరాజు, నామని సదానందం, బానోతు చందూనాయక్, పేరాల సురేందర్, సంగెపు వీరయ్య, బానోతు కిష¯ŒSనాయక్, భూక్య రవినాయక్, ఆకుల రంగారావు, మేర్గు కట్టన్న, ఎలుగం భాస్కర్, పాపని రమేష్‌తో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.   
>
మరిన్ని వార్తలు