‘విమోచనాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి’

24 Jul, 2016 23:36 IST|Sakshi
  • బీజేపీ నేత సునీతారెడ్డి డిమాండ్‌
  • ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు
  • హన్మకొండ : నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సందర్భాన్ని రాష్ట్రప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొంతం సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు. హన్మకొండ ఎన్జీవోస్‌ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మహిళా మోర్చా జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది.
     
    ఈ సమావేశంలో సునీతారెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 7 నుంచి 14వ తేదీ వరకు మహిళా అధ్యాపకులు, ఉపాధ్యాయులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటుచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇంకా ఆగస్టు 16 నుంచి 21 వరకు మహిళా కాలేజీల్లో వ్యాసరచన పోటీలు, సంతకాల సేకరణ నిర్వహించాలని,22 నుంచీ 28వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. అంతేకాకుండా రక్షా బంధన్‌లో భాగంగా అధికారులకు వినతి పత్రాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవళి, జిల్లా అధ్యక్షురాలు ఏదునూరి భవాని, నాయకులు పి.రాజేశ్వరి, రాణి, పారం అనిత, గుజ్జుల సరోజన, వనపాక రాధ, కందుగుల స్వరూప, సోమయ్య, ధశరథం, కుమార్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు