అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ది నిరోధకులా..?

25 Dec, 2016 23:23 IST|Sakshi
అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ది నిరోధకులా..?

-ఆకేపాటి ఆమర్‌నాథ్‌ రెడ్డి
రెడ్డివారిపల్లె(రైల్వేకోడూరు రూరల్‌): టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులవుతారా? అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి నిలదీశారు.  ప్రజల తరుపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకుడైన వైస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఉందన్నారు. రైల్వేకోడూరు మండలంలోని రెడ్డివారిపల్లెలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు ఆయన హాజరయ్యారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగతనేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో పోతిరెడ్డి పాడు, గాలేరు–నగిరి, హంద్రీ నీవా పనులు 80 శాతం పూర్తిచేశారని తెలిపారు. టీడీపీ యాంలో సీఎం చంద్రబాబు 20 శాతం పూర్తి చేయలేకపోగా పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు అందిస్తాం, పులివెందులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూటకో మాట చెప్పడం తప్ప ఆయన రాష్ట్రానికి, జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. వైఎస్‌ చేసిన పనులకు గేట్లు ఎత్తారు తప్ప ఆయన గొప్ప అందులో ఏమీలేదన్నారు. ఇటీవల కడపలో జరిగిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చి చేసిందే తప్ప జిల్లాకు ఆయన సొంతంగా చేసిందీ శూన్యమన్నారు. సోమవారం  పులివేందులలో పీబీసీ రైతులు చేస్తున్న దీక్షకు అందురూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, మండల కన్వీనర్లు కోడూరు సుధాకర్‌రాజు, చిట్వేలి చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, పుల్లంపేట ముద్దా బాబుల్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, క్షత్రియ నాయకులు సిద్దేశ్వరరాజు, నియోజకవర్గ అధికార ప్రతినిది ఎం.నాగేంద్ర, మెనార్టీనాయకులు ఆదాం సాహేబ్, ఎంపీటీసీలు శివయ్య, రవి కుమార్ తదితరులు హాజరయ్యారు.

 
 

మరిన్ని వార్తలు