అహింసా మార్గంలోనే అభివృద్ధి

2 Oct, 2016 23:02 IST|Sakshi
అహింసా మార్గంలోనే అభివృద్ధి

– కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ
కడప కల్చరల్‌ : అహింస మార్గంలో వెళ్లినపుడే అభివృద్ధి సాధించగలమని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వన్‌టౌన్‌ సర్కిల్‌లోగల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింస వాదమే తన ఆయుధంగా అనుకున్నది సాధించి భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన శాంతి యోధుడు గాంధీజీ అన్నారు.  కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల నివాళులు:
 బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, నాయకులు షఫీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లెపురెడ్డి హరినాథరెడ్డి, చలమారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, సాంబశివారెడ్డి, గోసుల శ్రీనివాసులురెడ్డి, వీవీ చలపతి, సుభాన్‌బాషా తదితరులు మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు