విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి

21 Aug, 2016 23:49 IST|Sakshi
  • ఎస్సీ, ఎస్టీ పోలీస్‌ యూనియన్‌ 
  • జాతీయ అధ్యక్షుడు సీఐ విష్ణుమూర్తి
  • కేయూ క్యాంపస్‌ : విద్య ద్వారానే ఆది వాసీల అభివృద్ధి జరుగుతుం దని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ పోలీస్‌ యూనియ న్‌ జాతీయ అధ్యక్షుడు సీఐ విష్ణుమూర్తి అన్నారు. ఆదివాసీ స్టూడెంట్స్‌ యూనియ న్‌(ఏఎస్‌యూ)ఆధ్వర్యంలో ఆదివారం కేయూ ఎస్‌డీఎల్‌సీఈ సెమినార్‌హాల్‌లో ‘రైట్‌టూ ఎడ్యూకేషన్‌ టూది ఆదివాసీస్‌’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
     
    ఆది వాసీలు అనేకరంగాల్లో వెనకబాటులోనే ఉన్నారని, విద్య ద్వారానే నాగరిక సమాజంలో కలిసి తమ హక్కులను ఉనికిని కాపాడుకోగలుగుతామని చెప్పారు. కేయూ జూవాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఈసం నారాయణ మాట్లాడుతూ ఆదివాసీ 5వ షెడ్యూల్‌ ప్రాం తాన్ని నూతన జిల్లాల విషయంలో ముక్కలు చేసి ఆదివాసీలను విఛ్చిన్నం చేయవద్దని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో  ఏఎస్‌యూ బా ధ్యులు రేగ రమేష్, చుంచ విజయ్, రాము, మెస్త్రం మనోహర్, కె.జనార్దన్, ఉదయశ్రీ, అరుణశ్రీ, పాపారావు, వెంకట్‌ పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు