అక్షరాస్యతలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి

9 Sep, 2016 00:53 IST|Sakshi
  • జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మ
  • హన్మకొండ : అక్షరాస్యతలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలపాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ జి. పద్మ అధికారులకు సూచించారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశం మందిరంలో అంతర్జాతీయ అక్షరాస్య త దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 65.11 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందని చెప్పారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతంలో నాలుగో స్థానంలో జిల్లా ఉందని.. దీని నుంచి ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చేందుకు సాక్షరభారత్‌ మండల, గ్రామ కోఆర్డినేటర్లు కృషి చేయాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచిం చారు. వయస్సు మీరిన తమకు చదువు ఎందుకు అంటూ వెనకడుగు వేసే వారికి చదువు వస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో వివరించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేసిన గ్రామ కోఆర్డినేటర్లును జెడ్పీలో సన్మానించడంతో పాటు నగదు బహుమతి అందించనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ ఎస్‌.విజయ్‌గోపాల్‌ మాట్లాడుతూ మండల, గ్రామ కోఆర్డినేటర్లు తమ పని తీరును మెరుగు పరుచుకోవాలన్నారు. సాక్షరభారత్‌ ఇ¯Œæచార్జీ డిప్యూటీ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ కో ఆర్డినేటర్‌ 15 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలన్నారు. అక్షరాస్యత శాతంలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపినప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. సమావేశంలో సాక్షరభారత్‌ పర్యవేక్షకులు, మండల, గ్రామ కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు