అడవి బిడ్డల ఎదురు చూపులు!

19 Nov, 2016 00:41 IST|Sakshi
అడవి బిడ్డల ఎదురు చూపులు!

పట్టాలు పంపిణీ చేయాల్సిన
మండలాలు: 8
ఎకరాలు: 8,871
కుటుంబాలు: 3,436

 
►అటవీసాగు హక్కు పత్రాల పంపిణీకి గ్రహణం
► రెండో విడత పంపిణీ  జరగని వైనం
►ఎదురు చూస్తున్న 3,500గిరిజన కుటుంబాలు

 
 
అడవి బిడ్డలు అటవీసాగు హక్కు పత్రాల (పట్టాలు) కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. 2006వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని తెచ్చింది. 2005 డిసెంబర్ 13వ తేదీకి ముందు సాగులో ఉన్నవారికి పట్టాలివ్వాలని అధికారులు నిర్ణరుుంచారు. దీంతో జిల్లాలోని కొంతమంది గిరిజనులకు 2008లో హక్కు పత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెండో విడత పంపిణీ గురించి కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు.

 
సీతంపేట: గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అరుుతే అటవీ అధికారులు ఒక్కోసారి వారి పనులకు అడ్డుతగులుతుండేవారు. దీంతో సాగు హక్కు పట్టాలివ్వాలని ఉద్యమించడంతో దిగివచ్చిన పాలకులు అటవీ హక్కు చట్టాన్ని చేసింది. అరుుతే ఈ చట్టానికి జిల్లా అధికారులు తూట్లు పొడిచారనే విమర్శలు వస్తున్నారుు. కేవలం 2008లో కొద్దిమంది గిరిజనులకు హక్కు పత్రాలను ఇచ్చి..మిగిలిన వారిని పట్టించుకోవడం మానేశారు. రెండో విడతలోనైనా అందుతాయని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. దీంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన చెందుతున్నారుు.

పక్క జిల్లాల్లో పంపిణీ
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, పార్వతీపురం పరిధిలోని గిరిజనులకు సాగు హక్కు పత్రాలను అక్కడి అధికారులు రెండోవిడతలో పంపిణీ చేశారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈ విషయం తెలిసి ఎప్పుడు పంపిణీ జరుగుతుందోనని గిరిపుత్రులు ఎదురు చూస్తున్నారు. ప్రతీ సోమవారం సీతంపేట ఐటీడీఏలో జరిగే గిరిజన దర్బార్‌కు వచ్చి సాగు హక్కు పట్టాలు ఇవ్వడం లేదంటూ అధికారులకు వినతులు అందిస్తూనే ఉన్నారు. అధికారుల సర్వే ప్రకారం 3,436 కుటుంబాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వీరంతా భామిని, కొత్తూరు, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాల్లో ఉన్నారు. గత ఏడాది గిరిజనోత్సవాలకు వచ్చిన గిరిజనశాఖ మంత్రి చేతుల మీదుగా కొంతమంది పట్టాలు ఇవ్వడానికి ఐటీడీఏ యంత్రాం గం ఏర్పాట్లు చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులతో సమన్వయం లేకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదు.  

8 వేల ఎకరాలపైనే...
పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 3,436 గిరిజన కుటుంబాలకు సంబంధించి 8,881.74 ఎకరాల్లో పట్టాలు ఇవ్వడానికి నిర్ణరుుంచారు. ఈ మేరకు గతంలోనే గ్రామస్థారుులో అటవీహక్కుల కమిటీ, డివిజన్, జిల్లా స్థారుు కమిటీలు తీర్మానం సైతం చేశారుు. కమిటీల తీర్మానం చేసినప్పటికీ అటవీశాఖ మాత్రం అంగీకరించలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోరుుంది.

పరిస్థితి ఇలా..
పాలకొండ డివిజన్‌లోని సీతంపేట మండలంలో 1420 కుటుంబాలకు సంబంధించి 4164.39 ఎకరాలకు, భామినిలో 463 కుటుంబాలకు గాను 1501.98, కొత్తూరులో 145 కుటుంబాలకు 322.86, పాలకొండలో 19 కుటుంబాలకు 56.8, పాతపట్నంలో 332 కుటుంబాలకు 465.69, వీరఘట్టంలో 162 కుటుంబాలకు 596.3,  హిరమండలంలో 202 కుటుంబాలకు గాను  659.64, మెళియాపుట్టిలో 580 కుటుంబాలకు 896.18, మందసలో 113 కుటుంబాలకు 218.72 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

ప్రయోజనం..
గిరిజనులకు సాగుహక్కు పత్రాలు ఇస్తే భూమిపై పూర్తి హక్కులు కలుగుతారుు. అలాగే పంట రుణాలను బ్యాంకర్లు ఇస్తారు. అటవీ ఫలసాయాలపై పూర్తి హక్కులు గిరిజనులకు ఉంటారుు.
 
పట్టాల పంపిణీ చాలా ముఖ్యం
గిరిజనులకు అటవీ సాగు హక్కు పట్టాల పంపిణీ చాలా ముఖ్యమైంది. పాడేరులో చాలా ఎక్కువ పట్టాలు పంపిణీ చేశాం. ఇక్కడ ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఎందుకు పంపిణీలో జాప్యం జరిగిందనే విషయమై పరిశీలించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్‌తో చర్చించి పంపిణీకి చర్యలు తీసుకుంటాం.- ఎల్.శివశంకర్, ఐటీడీఏ పీవో

ఆధారాలు చూపకపోవడం వల్లే..
గిరిజనులు తగిన ఆధారాలు చూపిస్తే పట్టాలు ఇస్తాం. అరుుతే ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నామనే ఆధారాలేవీ మాకు చూపించలేదు. పోడు పట్టాలకు సంబంధించిన గిరిజనులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో సాగుహక్కు పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతుంది.  - జి.జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి

ప్రభుత్వ వైఫల్యమే
గిరిజనులకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు గిరిజనులకు పట్టాలు పంపిణీ జరిగింది. ఇప్పుడు పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు తప్పితే పంపిణీకి మాత్రం చర్యల్లేవు.  - విశ్వాసరారుు కళావతి, పాలకొండ ఎమ్మెల్యే

లిఖిత పూర్వకంగా ఇవ్వాలి
గిరిజనులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో లిఖితపూర్వకంగా చెప్పాలని అడుగుతున్నాం. దీనిలో అటవీశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా గిరిజనులు అన్యాయానికి గురౌతున్నారు.      - బి.సంజీవరావు,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల సాధన సమితి అధ్యక్షుడు


 

మరిన్ని వార్తలు