ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు ’చెన్నుపాటి’

19 Dec, 2016 00:58 IST|Sakshi
అనంతపురం ఎడ్యుకేషన్  : ఉపాధ్యాయ ఉద్యమ  పితామహుడు చెన్నుపాటి లక్ష్మ య్య అని యూటీఎఫ్‌ నాయకులు  కొని యాడారు.  ఆదివారం స్థానం యూ టీఎఫ్‌ జిల్లా  కార్యాలయంలో చెన్ను పాటి లక్ష్మయ్య 18వ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎం. సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిలాన్ తదితరులు మాట్లాడారు.  బ్రిటీష్‌ పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉపా« ద్యాయుల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ హక్కుల సాధనకు లక్ష్మయ్య పోరాడారని గుర్తు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌వీవీ రమణయ్య మాట్లాడుతూ  చెన్నుపాటి లాంటి వారి త్యాగాల ఫలితంగానే నేడు ఉపాధ్యాయులు మెరుగైన వేతనాలు పొందుతున్నారన్నారు.  జిల్లా గౌరవాధ్యక్షుడు  సీకే నాగేంద్రబాబు   జిల్లా కార్యదర్శి కోటేశ్వరప్ప    యూటీఎఫ్‌ నాయకులు సురేష్, సలావుద్దీన్, గోపాల్, రూత్, నల్లప్ప, పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు