ఐదుగురు వైద్యులపై కొరడా

4 Oct, 2016 00:01 IST|Sakshi
ఐదుగురు వైద్యులపై కొరడా
  • మెమో జారీకి కలెక్టర్‌ ఆదేశాలు
  • విధులకు ఎగనామం పెట్టిన ఐదుగురు వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ కొరడా ఝుళిపించారు. ఆదివారం స్థానిక మెడికల్‌ కళాశాలలో వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్‌.. ఆస్పత్రుల్లో వంద శాతం హాజరు ఉండాలని ఆదేశించారు.  సోమవారం స్వయాన∙    ఆన్‌లైన్‌లో హాజరును పర్యవేక్షిస్తానన్నారు. చెప్పినట్టుగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల హాజరును పరిశీలించారు. సాయంత్రం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణను పిలిపించుకుని హాజరుపై ఆరా తీశారు.  మొత్తం 19 మంది డాక్టర్లు విధులకు గైర్హాజరైనట్లు బయోమెట్రిక్‌లో తేలింది. వీరిలో నలుగురు ప్రసూతి సెలవులో ఉండగా.. ముగ్గురు క్యాజువల్‌ లీవ్‌ (సీఎల్‌)లో ఉన్నట్లు నిర్ధారించారు. బయోమెట్రిక్‌ పని చేయకపోవడం.. నెట్‌ కనెక్షన్‌ లేకపోవడంతో ఏడుగురు విధుల్లో ఉన్నా హాజరు నమోదుకాలేదు. అయితే..  కనగానపల్లి, అగళి, యాడికి, రాకెట్ల, బ్రహ్మసముద్రం  వైద్యులు విధులకు డుమ్మా కొట్టినట్లు తేలింది. ఈ ఐదుగురికి చార్‌్జమెమోలు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో రాత్రి 8.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న డీఎంహెచ్‌ఓ మెమోలు సిద్ధం చేశారు. మంగళవారం వీటిని జారీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు