ఆ నలుగురు

16 Aug, 2016 23:52 IST|Sakshi
ఆ నలుగురు
భర్త చనిపోయాడు...కుమార్తె అందుబాటులో లేదు. కుమారుడు మద్యానికి బానిసై ఎక్కడున్నాడో తెలియదు..పాపాం అభాగ్యురాలు భర్త దహన సంస్కారాలు కోసం ఆరాటపడింది. దుఃఖాన్ని దిగమింగుకుని నేరుగా కాన్వెంట్‌ జంక్షన్‌లో ఉన్న హిందూశ్మశాన వాటికకు వెళ్లింది. అక్కడ శ్మశానవాటిక ఇన్‌చార్జి ప్రసన్నకుమార్‌ను కలిసింది. ‘నా భర్త అనారోగ్యం చనిపోయాడు..కనీసం శ్మశానికి తీసుకొచ్చేవారూ కూడా లేరు..మీరే సాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంది. మనసున్న ప్రసన్నకుమార్‌ స్పందించారు. శ్మశానవాటిక ఇన్‌చార్జ్‌తో పాటు వర్కర్స్‌ రమణమూర్తి, సుందరరావు, పోలరాజు, తులసి అల్లిపురం వచ్చి దహన సంస్కరణలు నిర్వహించారు.  అంతేకాదు సత్యవతి ఆర్థిక పరిస్థితి గమనించి శ్మశానవాటిక సిబ్బంది రూ.1500లు కూడా అందజేసి ఇలా మానవత్వం చాటుకున్నారు.
 (అల్లిపురం పాలకేంద్రం సమీపంలోని కనకరాజు ప్లాస్టిక్‌ సామాన్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనారోగ్యంతో మంగళవారం మతి చెందాడు.)
మరిన్ని వార్తలు