సంపూర్ణ అక్షరాస్యతే రోటరీ క్లబ్‌ ధ్యేయం

5 Sep, 2016 00:08 IST|Sakshi
ఖిలా వరంగల్‌ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే రోట రీ క్లబ్‌ ధ్యేయమని క్లబ్‌ గవర్నర్‌ రత్న ప్రభాకర్‌ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ, ఆక్షరాస్యత ఉద్యమంలో భాగంగా ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కాకతీయ వరంగల్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ స్టేషన్‌రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్‌లో క్లబ్‌ ఆధ్యక్షుడు రవ్వ జగదీష్‌ ఆధ్యక్షతన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రత్న ప్రభాకర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
 
ప్రభుత్వం చేయని సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్‌  చేపట్టడం ఆభినందనీయమన్నారు. సంపూర్ణ అక్షరాస్యతా దేశంగా మారాలన్నదే క్లబ్‌ లక్ష్యమని, దీనికి ఉపాధ్యాయుల పాత్ర, సహకారం ఎంతో అవసరమన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులన్ని డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లుగా మార్చి ఈ– లర్నింగ్‌ బోధనే ధ్యేయంగా రోటరీ భావించిందన్నారు. జిల్లాలోని173 పాఠశాలకు డిజిటల్‌ క్లాస్‌రూంలకు కావాల్సిన మెటీరి యల్‌ను అందజేశామని తెలిపారు. బడి బయట ఉన్న బాలబాలికలను ఏడాదికి లక్ష చొప్పున పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అనంతరం జిల్లాలో ఎంపిక చేసిన 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రోటరీక్లబ్‌ గవర్నర్‌ రత్న ప్రభాకర్, జిల్లా ఉప విద్యాధికారి సారంగపాణి అయ్యంగార్‌ ప్రశంసా పత్రా లు, శాలువాలతో ఘనంగా సన్మానించా రు.చందర్, ఇంద్రసేనారెడ్డి, రోటరీక్లబ్‌ ఫౌం డేషన్‌ ఏరియా చైర్మన్, అసిస్టెంట్‌ గవర్నర్‌ వైద్యనాథ్, భానుప్రసాద్‌రెడ్డి, ప్రభాకర్, శివకుమార్, మానస, సభ్యులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు