ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

23 Aug, 2016 20:37 IST|Sakshi
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్‌ అన్నారు. ఆలేరులో మంగళవారం జరిగిన మండల కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆశలు ఆడియాసలయ్యాయని విమర్శించారు. పుష్కరాలు, పండుగలు, వేడుకల పేరిట ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చి రాష్ట్రాన్ని దివాల తీస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తుందని, పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటన్నారు. త్వరలో రైతు సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ జనగాం ఉపేందర్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొలుపుల హరినా«ద్, కె సాగర్‌రెడ్డి, నీలం పద్మ, ఎండి జైనోద్దీన్, ఎగ్గిడి యాదగిరి, ఎంఎస్‌ విజయ్‌కుమార్, జంపాల దశరధ, పిల్లలమర్రి శంకరయ్య, ఎంఎ ఎజాజ్, నీలం వెంకటస్వామి, కందుల శంకర్, జూకంటి ఉప్పలయ్య, ఎలగల కృష్ణ, దూసరి విజయ, బేతి రాములు, బండి నాగయ్య, ముదిగొండ శ్రీకాంత్, పత్తి వెంకటేశ్, పల్లె సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు