‘పది’ పాట్లు

16 Mar, 2017 01:59 IST|Sakshi
‘పది’ పాట్లు

పలుచోట్ల ఫ్యాన్లులేవు.. మరికొన్ని చోట్ల చీకటి  గదులు
సౌకర్యాల కల్పనలో ఈసారీ విద్యాశాఖ విఫలం
అసౌకర్యాల నడుమే రేపటి నుంచి పది పరీక్షలు


విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదోతరగతి పరీక్షలు రాసే సమయం రానే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యాశాఖ ఈసారి కూడా అరకొర సౌకర్యాల నడుమే పరీక్షలను నిర్వహించడానికి సిద్ధమైంది. పైకేమో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం పరీక్ష కేంద్రాల్లో కనీసం వసతులు లేవు.

చిత్తూరు, ఎడ్యుకేషన్‌: ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్న విద్యాశాఖ ఈసారి కూడా అసౌకర్యాల నడమ పరీక్షలను ప్రారంభిస్తోంది. ఓ వైపు ఎండలు మండుతున్నాయి. విద్యార్థులు వాటిని తట్టుకుని పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఒక కష్టమైతే అక్కడి అసౌర్యాల నడుమ పరీక్షలు రాయడం విద్యార్థులకు పెనుసవాల్‌గా మారనుంది. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని విద్యాశాఖాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. పదోతరగతి పరీక్షా కేంద్రాల ఏర్పాట్లపై జిల్లావ్యాప్తంగా పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భావి భవిష్యత్‌కు తొలిమెట్టు..
పదోతరగతి విద్యార్థులపై విద్యాశాఖతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.  కానీ పరీక్షలు రాసే వేళకు మాత్రం అధికారులు సౌకర్యాల కల్పనలో చతికిలపడుతున్నారు.

భానుడి ప్రకంపనలు..
జిల్లాలో వేసవి ఎండలు భగభగమంటున్నాయి. పది పరీక్షా కేంద్రాల్లో చాలాచోట్ల కనీసం ఫ్యాన్లు కూడా లేవు. దీంతో విద్యార్థులు ఉక్కపోతలోనే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. దానికి తోడు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడంతో సంబం ధిత అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. వీటిని గుర్తించి ముందస్తు సౌకర్యాలు కల్పించాల్సిన విద్యాశాఖ ఆ దిశగా ప్రయత్నించడంలో విఫలమైంది.

విరిగిన బల్లలే దిక్కు..
విద్యార్థులందరూ కచ్చితంగా బ   ల్లలపై కూర్చొని పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఇన్‌చార్జ్‌ డీఈవో శ్యామ్యూల్‌ ఇటీవల విలేకరులకు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తే అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఏదో బల్లలు వేశాం.. చేతులు దులుపుకున్నాం అన్నట్లు  విద్యాశాఖకానిచ్చింది. ఫలితంగా విద్యార్థులకు విరిగిన బల్లలను, కూర్చొవడానికి ఇబ్బం దిగా ఉన్న వాటిని వేసింది. పలుచోట్ల విద్యార్థులకు సరిపడా బల్లలు ఇంకా సర్దుబాటు చేయలేకపోయినట్లు పలు పరీక్షా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. ఇంటర్‌ పరీక్షల్లో ఎదురైన సమస్యలు పది పరీక్షల్లో కాకుండా ముందస్తు చర్యలు చేపట్టనప్పటికీ బల్లల కొరతతో పాటు తాగునీటి వసతి సరిగా కల్పించలేదు.

శ్రీకాళహస్తిలో..
పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏ, బీ రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రాల్లోని ఏ ఒక్కరూములో కూడా ఫ్యాన్లు, లైట్లు లేవు. అలాగే బీ కేంద్రంలో  కేవలం గది మొత్తానికి ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉంది. అలాగే బాబుఅగ్రహారం పాఠశాలలో ఇప్పటివరకు తరగతి గదిలో బెంచీలు ఏర్పాటు చేయలేదు. తాగనీటి వసతి అరకొరగానే కల్పించారు. కొత్తపేట బాలికల పాఠశాలలో మూడు గదుల్లో పూర్తిగా ఫ్యాన్లు లేవు. ఒక గదిలో  బెంచీలు కూడా లేవు. పానగల్, గిరిజన పాఠశాలలోని కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి.

పూతలపట్టులో..
పూతలపట్టు నియోజవర్గంలోని ఎర్రచెరువుపల్లె జెడ్పీ హైస్కూల్‌లో గతంలో పలుమార్లు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రికి చెందిన పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో ప్రతిఏటా పరీ క్షలు రాస్తున్నారు. తమ పాఠశాల విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చేలా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలున్నా యి. అయితే ఇలాంటి ఆరోపణలున్న సమస్యాత్మక కేంద్రంలో విద్యాశాఖ  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు.

>
మరిన్ని వార్తలు