మూల్యాంకనంలో మాయాజాలం

3 Oct, 2016 23:22 IST|Sakshi
మూల్యాంకనంలో మాయాజాలం
  •  ఐసీటీ సబ్జెక్టులో వందకు 92 మంది ఫెయిల్‌
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
  • యూజీ విభాగం ఎదుట ధర్నా
  • వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ ఫలి తాలు గత వారం  విడుదలయ్యా యి.  ఐసీటీ (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ) సబ్జెక్టులో  ప్రతి 100 మంది విద్యార్థులకు 92 మందిని ఫెయిల్‌ చేశారు. మిగిలిన సబ్జెక్టుల్లో  వీరు 70 నుంచి 80 శాతం మార్కులు సాధించినవారే.

     ఫలితాల్లో కేవలం 19 ఉత్తీర్ణత శాతం (అన్ని సబ్జెక్టుల్లో) నమోదు కావడానికి ఐసీటీ సబ్జెక్టు మూల్యాంకనంలో నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే అన్ని సబ్జెక్టుల్లో  ఉత్తీర్ణత చెందారు. మిగిలినవారందరూ  ఐసీటీలో ఫెయిల్‌ అయ్యారు. దీనిపై అధ్యాపకులు వర్సిటీ యూజీ డీన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అనివార్య పరిస్ధితి.


     ఇంటర్నల్‌ మార్కులు     తెచ్చిన తంటా :
     డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ఇంటర్నల్‌ మార్కులు న మోదు చేయకుండా ఫలితాలు ప్రకటించారు. అ నుబంధ డిగ్రీ కళాశాలల సిబ్బంది ఇంటర్నల్‌ మార్కులు పంపడంలో నిర్లక్ష్యం చేశారు. కొందరు పంపినా  నమోదులో యూజీ అధికారుల తాత్సారం కారణంగా వేలాది మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.  


    జిల్లా నలుమూలల నుంచి డిగ్రీ విద్యార్థులు సోమవారం ఎస్కేయూకు తరలివచ్చి   నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యూజీ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటరమణ, యూజీ డీన్‌ జీవన్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌ శ్రీరాములు నా యక్‌ విద్యార్థులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  కొన్ని కళాశాలల సిబ్బంది  ఇంటర్నల్‌ మార్కులు పంపక పోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటరమణ అన్నారు. 

    24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు వైఎస్సార్‌ విద్యార్ధి విభాగం నాయకులు జయచంద్రా రెడ్డి, క్రాంతికిరణ్,  భానుప్రకాష్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జాన్సన్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్‌ యాదవ్, కే.మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు