మంత్రి ఇంటి ముట్టడికి రెండో ఏఎన్‌ఎంల యత్నం

20 Aug, 2016 23:08 IST|Sakshi
మంత్రి ఇంటి ముట్టడికి రెండో ఏఎన్‌ఎంల యత్నం
బాన్పువాడ టౌన్‌ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలోని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇల్లును ముట్టడించేందుకు రెండో ఏఎన్‌ఎంలు ప్రయత్నించారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంనుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వచ్చారు. సీఐ వెంకటరమణరెడ్డి, ఎస్సై సంపత్‌లు సిబ్బందితో కలిసి వారిని అడ్డుకున్నారు. దీంతో ఏఎన్‌ఎంలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. రెండో ఏఎన్‌ఎంలను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, 35 రోజుల క్యాజువల్‌ లీవ్, 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు డిమాండ్‌ చేశారు. అనంతరం మంత్రి తనయుడు సురేందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా మహిళా కన్వీనర్‌ నూర్జహాన్, సీఐటీయూ నాయకులు ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు