కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు

13 Mar, 2017 03:23 IST|Sakshi
కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు

నాయకులు, కార్యకర్తలతో ఎంపీ విజయసాయిరెడ్డి
నగర పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దిన వేడుకలు


సాక్షి,విశాఖపట్నం : పార్టీ కోసం కష్టపడుతున్నవారిని అధిష్టానం గుర్తిస్తుందని, వారికే పెద్దపీట వేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేసిన అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ప్రసంగించారు. 2019 ఎన్నికలు పార్టీకి ఎంతో ముఖ్యమని, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడతాయని, ప్రతిపక్షంలో ఉన్నా.. భవిష్యత్‌తో అధికారం చేపట్టినా వైఎస్సార్‌ సీపీ మాత్రం ప్రజల శ్రేయస్సుకే పాటుపడుతుందని తెలిపారు. జూలై 8న పార్టీ ప్లీనరీ జరపాలని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని, ఆలోగా జిల్లా స్థాయిలో కమిటీలు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, వాటిని సాధించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆది, సోమవారాల్లో యువజన, మహిళా విభాగాల సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కోసం ఈ నెల 22న అనకాపల్లి నుంచి భీమిలి వరకూ పాదయాత్ర ప్రారంభిస్తున్నానని మరోసారి ప్రకటించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి తాను కచ్చితంగా పాల్గొంటానని సభా ముఖంగా చెప్పారు.

ఈ వేడుకల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రసాదరాజు, గొల్ల బాబూరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాదరెడ్డి, మొండితోక అరుణ్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర కార్యదర్శి చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర గ్రీవెన్స్‌సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి, స్టేట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబా, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్, కోలా గురువులు, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్, పెట్ల ఉమాశంకర గణేష్, రాష్ట్ర సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర కార్శదర్శులు రొంగలి జగన్నాథం, గురుమూర్తి రెడ్డి, కంపా హనోక్, జాన్‌ వెస్లీ, రాష్ట్ర బీసీడీఎఫ్‌ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు రవిరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫరూకీ, జిల్లా పార్టీ మహిళాధ్యక్షురాలు ఉషాకిరణ్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం ఇన్‌చార్జి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు